UPDATES  

 ప్లేడే పి హెచ్ డి లపై ఆంక్షలు ఎత్తివేయాలి

ప్లేడే పి హెచ్ డి లపై ఆంక్షలు ఎత్తివేయాలి
*ఓ సి -2 గని మేనేజర్ సురేశ్ కుమార్ కి వినతి పత్రం అందజేసిన ఆపరేటర్లు
మన్యం న్యూస్,మణుగూరు:
సింగరేణి ఉపరితల గనులలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి సింగరేణి యాజమాన్యం విధించిన ప్లేడే పి హెచ్ డి లపై ఆంక్షలు ఎత్తివేయాలనీ కోరుతూ మణుగూరు ఏరియా ఓసి -2 ఆపరేటర్లు గురువారం ఓ సి -2 గని మేనేజర్ సురేశ్ కుమార్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆపరేటర్లు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా వివిధ ఓపెన్ కాస్ట్ గనులలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి ప్లేడే పి హెచ్ డి లపై మైనస్ వన్ పేరుపై సింగరేణి యాజమాన్యం ఆంక్షలు విధించారని ఫలితంగా కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు, స్థానిక యాజమాన్యం కూడా గత కొన్ని వారాలుగా ఈ పీ ఆపరేటర్లకు సంబంధించిన ప్లేడేలు కూడా కొంతమేరకు తగ్గించారనీ , సింగరేణి కార్మికుల సంపాదనలో ఆదాయపు పన్ను, ఇతర జీతపు కోతలు పోను ఏదైనా ఒక రూపాయి చేతికి వచ్చేది ఉందంటే అవి ప్లేడే పిహెచ్ డి ల అలవెన్స్ ల రూపం లో మాత్రమే నని ఇప్పటికే వారానికి నాలుగు రోజులు హాజర్లు షరతు ఒకటి, మైనస్ వన్ నిబంధన ఒకటి, మరలా స్థానిక యాజమాన్యపు కోతలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితనీ దయచేసి పూర్వ పద్ధతిలోనే ప్లేడేలు పునరుద్దించాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో చ్ డి లపై ఆంక్షలు ఎత్తివేయాలి ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు యస్ డి నా సర్ పాషా,సిల్వేరు గట్టయ్య, యస్ కుమారస్వామి, ఐ శంకర్, మేకల ఈశ్వర్ ,జానకి ప్రసాద్,అంజయ్య,అహ్మద్,సుదర్శన్,సురేష్,బుచ్చిరెడ్డి,యం శ్రీనివాస్,యాకయ్య, ఏ లక్ష్మీ నారాయణ, ఎండీ ఖుద్దుద్దీన్ , కిషన్, కేశవస్వామి ,పి శ్రీనివాస్,రాజేంద్ర ప్రసాద్,తాటి సత్యనారాయణ, సిహెచ్ శ్రీనివాస్, యూనస్,జాకీర్, రవిశంకర్,సుధాకర్,,అజీమియా,ఇసాక్,సతీష్, ఎన్ రమేష్, భూక్యా అంజి,నాగరాజు,దేవేందర్,ఎస్ టి ఆర్ నాయుడు,శ్రీధర్,నిర్మల్, రాధా కృష్ణ,దరిసా రమేష్, దొరయ్ రాజ్,పెరుమాళ్,హరిసింగ్,భూక్యా రామకృష్ణ, సంజయ్,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !