మన్యం న్యూస్ ,కరకగూడెం: మండల పరిధిలోని కోరనవల్లి గ్రామంలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా నివాసంలో జరిగే బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎంపిపి రేగా కాళికా, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల. సోమయ్య గౌడ్ మన్యం న్యూస్ కి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో ఎంపిపి రేగా కాళికా ఇంటివద్ద పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కలదని,ఈ సమావేశానికి ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు హాజరై కొనసాగిస్తారి తెలిపారు.ఈ కార్యక్రమానికి అన్ని గ్రామపంచాయతిల సర్పంచులు,ఎంపిటీసిలు,వార్డు నెంబర్లు,అనుబంధ సంఘాల నాయకులు బిఆర్ఎస్ పార్టీ బూతు కమిటీ సభ్యులు హాజరై సమావేశాన్ని విజయవంతం చెయ్యలని పిలుపునిచ్చారు.
