మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం లోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పాఠశాల ఆవరణంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవి సత్యనారాయణ బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పండుగలకు ఎంతో విశిష్టత సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు భక్తి శ్రద్దలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని తెలిపారు, బతుకమ్మ పండుగ విశిష్టత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని బతుకమ్మ అంటే అమావాస్యనాడు ఎంగిలి పూల పేరుతో ఎంగిలి కానీ పూలతో పేర్చిన బతుకమ్మ మధ్యలోపసుపు వర్ణముతో పూలతో అలంకరించిన దాన్ని గౌరమ్మ అంటారని దాన్ని అందరూ పూజిస్తారు. అని కులమత బేధాలు లేకుండా స్త్రీలందరూ ఆ గౌరమ్మ చుట్టూ తిరుగుతూ చిందులు వేస్తూ దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగిస్తారు అని తెలిపారు.ఏరి కోరి ఎంగిలి కానీ పూలతో బతుకమ్మలను తయారు చేసే సాంప్రదాయ పండుగ బతుకమ్మ అని మరోసారి తెలిపారు. ఇటువంటి సాంప్రదాయ పండుగను విద్యార్థులలో కూడా పండుగల పట్ల చైతన్యపరిచి పండుగ విశిష్టతను భావితరాలకు అందించే విధంగా అందరూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.