మన్యం న్యూస్ దుమ్ముగూడెం అక్టోబర్ 12::
మండల పరిధిలోని రామచంద్రుని పేట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల లో గురువారం ముందస్తు బతుకమ్మ పండుగను ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు అందరు కలిసి బతకమ్మ పండుగ ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సాంప్రదాయాలకు సంస్కృతికి ప్రతికగా నిలిచేది బతుకమ్మ పండగ తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక అత్యంత భక్తితో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు బతుకమ్మ, గౌరమ్మ పాటలు పాడుతూ ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి వీరమ్మ ,ప్రైమరీ పాఠశాల హెచ్ఎం బి సైదులు ఉపాధ్యాయులు పార్వతి, శాంతి ,సబిత, లత, హనుమంతు, పద్మ ,జ్యోతి, రవి, సురేష్ ,వీరన్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.