నేటి నుండి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం
* మార్కెట్లో పూల సందడి
* కళకళలాడుతున్న సూపర్ బజార్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
పూల పండగ రానే వచ్చింది.. ఇక మహిళా మణులతో తొమ్మిది రోజులపాటు ప్రతి వీధిలో సందడే సందడి నెలకొన్ననున్నది. శనివారం నుండి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమై ఈనెల 22వ తేదీ వరకు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ సంబరాలకు మహిళలు సిద్ధమవుతున్నారు. బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం సూపర్ బజార్ ఏరియాలో పూల వ్యాపార సందడి మొదలైంది. కొంతమంది వ్యాపారస్తులు విజయవాడ విశాఖపట్నం ఇతర పట్టణాల నుంచి వివిధ రకాల పూలను కొనుగోలు చేసి కొత్తగూడెంలో వ్యాపారం చేస్తున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి నుండి సూపర్ బజార్ ఏరియా వరకు పొడుగుతా పూల మార్కెట్ను కొంతమంది ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మహిళరారీమణులు పూలను కొనుగోలు చేసుకుని వెళ్లి బతుకమ్మ సంబరానికి సిద్ధమవుతున్నారు.