మన్యం న్యూస్: జూలూరుపాడు, అక్టోబర్ 13, ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతమైన వినోబానగర్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం స్థానిక ఎస్సై బి పురుషోత్తం వాహన తనిఖీ నిర్వహిస్తుండగా రెండు లక్షల రూపాయల డబ్బు పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూలూరుపాడు నుండి ఖమ్మం వైపు వెళ్తున్న టీఎస్ 04 యుడి 5970 నెంబర్ గల అశోక లేలాండ్ ఆటో ట్రాలీ ని తనిఖీ చేయగా కంభంపాటి ప్రసన్న అనే వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా రెండు లక్షల రూపాయల డబ్బులు పట్టుబడ్డాయని, సరైన ఆధారాలు చూపకపోవడంతో అట్టి డబ్బును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.