మన్యం న్యూస్,మణుగూరు:
బూర్గంపాడు మండలం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ని బూర్గంపాడు మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేసు పాక మహేష్, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రామకొండ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గోనెల నానిలు మర్యాద పూర్వకంగా కలిశారు. బూర్గంపాడు మండలంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మన్యం న్యూస్ తో మాట్లాడుతూ…ఎమ్మెల్యే రేగా కాంతారావు గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామని వారు తెలిపారు.
