బిఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి 176 బూత్ కోఆర్డినేటర్ మర్రి మల్లారెడ్డి, బూత్ ఇంచార్జ్ మేడవరపు సుధీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేగా గెలుపు కోసం మన్యం న్యూస్ , అశ్వాపురం:తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు 176 బూత్ కో ఆర్డనేటర్ మర్రి మల్లారెడ్డి ,176 బూత్ ఇంచార్జీ మేడ వరపు సుదీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి బిఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రతి పేదింటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి 1,00,116 రూపాయలు ,ఆడబిడ్డ జన్మిస్తే 13000 , బిడ్డ జన్మిస్తే 12,000, కేసీఆర్ కిట్టు, వృద్ధాప్య పెన్షన్ 2000 ,ఒంటరి మహిళ లకు పెన్షన్ , వికలాంగుల కు పెన్షన్ 4000, రైతు బందు, రైతు ఋణ మాఫీ ,దళిత బంధు , ఇంటింటికి త్రాగు నీరు ,సీసీ రోడ్లు ,డ్రైనేజీ వ్యవస్థ ,24 గంటలు కరెంట్ ఇలా అనేక విధాలుగా ప్రతి ఒక్కరికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను గురించి చెప్పడం జరిగింది .అదేవిధంగా మన పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు అభివృద్ధి చేస్తున్న సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచటం మణుగూరులో వంద పడకల హాస్పిటల్ లో నాణ్యమైన వైద్యం మణుగూరులో పోస్ట్మార్టం సెంటర్ ప్రతి గ్రామానికి వైకుంఠధామాలు ఇంటింటికి చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు పల్లె ప్రకృతి వనాలు ట్యాంకరు ఇలా ప్రతి ఒక్కటి మునుపున్నడు లేని విధంగా కొన్ని వందల కోట్ల రూపాయల వ్యయంతో మన పినపాక నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు అత్యధిక మెజారిటీతో వచ్చే ఎన్నికల్లో వారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించి మన గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నిర్మించుకుందామని తెలపడం జరిగింది.మన పినపాక నియోజకవర్గం అభివృద్ధి పథంలో ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలు ఈసారి కారు గుర్తుపై ఓటు వేసి రేగాకాంతారావు ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు పాటి మన్మథ రెడ్డి, దెరంగుల శేఖర్, తాటి పాముల రమేష్, అంబటి కర్ర శ్రీను, జంపాల ఉపేందర్, నుతలపాటి వెంకటేశ్ , తాళ్లూరి శ్రీను ,దేరంగుల వెంకులు, రమేష్, దిలీప్, మల్లిఖార్జున్, నిరంజన్ మరియు కార్య కర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
