మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్సిల్ స్కూల్ విద్యార్థులు ఈనెల 5, 6, 7 తేదీన ఉత్తర ప్రదేశ్ డెహ్రాడూన్ లో జరిగిన జాతీయస్థాయి సంస్కృత కార్యక్రమాల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచినారు. డపుకు రంగంలో తోలెం విష్ణు 9వ తరగతి విద్యార్థికి రాష్ట్ర, జాతీయస్థాయిలో మొదటి బహుమతిని గెలుపొందాడు. అదేవిధంగా రాష్ట్రస్థాయి సింగింగ్ విభాగంలో తుర్రం కావ్య, ఏడవ తరగతి విద్యార్థికి మొదటి బహుమతి, వరుణ్ వర్షిత్, పదవ తరగతి విద్యార్థికి హార్మోనియం రంగంలో మొదటి బహుమతి గెలుపొందారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో స్కూల్ ప్రిన్సిపల్ శకుంతల మాట్లాడుతూ సంస్కృత సంప్రదాయ కార్యక్రమాల్లో జిల్లా, రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయిలో మా విద్యార్థులు పాల్గొని మొదట బహుమతి పొందడం చాలా సంతోషించదగ్గ విషయమని ఇదేవిధంగా పిల్లల్లో ఉన్న నైపుణ్యాలు వెలికి తీసి అన్ని రంగాల్లో వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆమె అన్నారు. ఈ ఈ రంగాల్లో ప్రతిభ కనబరుచుటకు ప్రోత్సహించిన మ్యూజిక్ ఉపాధ్యాయుడు రవి కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి, టి పి సి చైర్మన్ వేణుగోపాల్, వెంకటేష్ పి. డి, అరుణ పిఈటి, బి. మనోహర్ లైబ్రరీ, డి రాజు మాథ్స్, విజయరామ్ మాథ్స్, ఎం రాజు ఇంగ్లీష్, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, టి పి సి సభ్యులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.