మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల నందు చరిత్ర, సాంస్కృతిక, మహిళా సాధికారత, ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా, ఘనంగా నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పోలారపు పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల సిపిడిసి ప్రధానకార్యదర్శి పులిగల్ల మాధవరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆద్యంతం విద్యార్థులు ఆటపాటలతో హోరోత్తించారు. అనంతరం బతుకమ్మ పేర్చటంలో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్ధినులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు బతుకమ్మ పేర్చిన ప్రతి విద్యార్థినికి కూడా ప్రత్యేక బహుమతులను పులిగళ్ళ మాధవరావు అందజేశారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ..ముందుగా ప్రతి ఒక్కరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అన్నారు. కళాశాల విద్య అభివృద్ధి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం తమవంతు ప్రయత్నంగా కళాశాలను జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉంచే ప్రయత్నం చేస్తామని, ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరును రాష్ట్రస్థాయిలో నిలబెట్టాలని విద్యార్దులకు సూచించారు. రాబోయేరోజుల్లో కూడా కళాశాలకు తనవంతు సహాయం ఎల్లవేళలా ఉంటుందని, అధ్యాపకులందరు కూడా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషిచేసి వారి బంగారు భవితకు బాటలు వేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ బిందుశ్రీ, అకడమిక్ కోఆర్డినేటర్ జి.శేఖర్, ఐక్యూఏసి కోఆర్డినేటర్ కిరణ్, చెంచురత్నయ్య, ఇంద్రాణి, డాక్టర్ రమేష్, శారద, రాజు, సరిత, సురేందర్, ఈశ్వర్, రాజు, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, లక్ష్మణరావు, సుజాత తదితరులు పాల్గొన్నారు.
