మన్యం న్యూస్ చర్ల:
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది, కూలి పని చేసుకుంటూ ఆ దంపతుల ఇద్దరి కుమారులను ఉన్నత చదువులు చదివించుకోవాలని ఆశయంతో జీవనం సాగిస్తూ ఉండగా వాళ్ల జీవితాల్లో అనుకోకుండా చీకటిలు కమ్ముకున్నాయి. కుటుంబంలోని పెద్దదిక్కు అనారోగ్యంతో మంచన పడ్డాడు. ఇంకేముంది వారి పిల్లల జీవితం పుస్తకాలు వదిలి కూలి పని చేసి తండ్రిని రక్షించుకునే పనిలో పరుగులు తీస్తున్నారు.తన భర్తని రక్షించండి అంటూ వైద్యం చేయించుటకు సహాయం చెయ్యండి అంటూ పలువురు దాతలను ఆర్ధిస్తుంది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడెం కు చెందిన కారం సుహాసిని తన భర్త సీతారామయ్య కూలి పని చేసుకుంటూ జీవన సాగిస్తూ తమ ఇద్దరి పిల్లలను చదివిస్తూ ఉన్నారు. గత గడిచిన మూడు సంవత్సరాలు నుంచి సీతారామయ్యకు అనారోగ్యంతో బాధపడుతూ మంచన పడ్డాడు. ఖమ్మం, హైదరాబాద్ హాస్పిటల్కు వైద్యం కోసం వెళ్ళగా తన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని మెరుగైన వైద్యం, మందులు వాడలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే మూడు సంవత్సరాల నుంచి నా భర్తకు వైద్యం అందిస్తూ 20 లక్షల వరకు అప్పు సప్పు, కూలి పని చేసి ఖర్చు చేశాము. వారంలో మూడు సార్లు హాస్పిటల్ కి తీసుకెళ్లి డయాలసిస్ చేయాల్సిందే వెళ్లిన ప్రతిసారి10000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మాది కూలి పని చేసుకునే నిరుపేద కుటుంబం దయచేసి దాతలు ఎవరైనా ఉంటే వైద్యం కొరకు సహాయం చేయగలరని నా భర్త ప్రాణాలు రక్షించుటకు సహాయం చేస్తారని ఆశిస్తూ వేడుకుంటున్నాను.