మన్యం న్యూస్: వైరా నియోజకవర్గ ప్రతినిధి, అక్టోబర్ 13, తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడం ఖాయం అని, బిఆర్ఎస్ విజయన్ని ఎవరు ఆపలేరని వైరా నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వైరా మాజీ శాసనసభ్యులు భానోత్ మదన్ లాల్ అన్నారు. శుక్రవారం వైరా లో పరుచూరి గార్డెన్ లో మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మద్దేల రవి అధ్యక్షతన జరిగిన వైరా మండల, మున్సిపాలిటీ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో బాణోత్ మదన్ లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ కమిటీ సభ్యులకు విధి విధానాలపై ప్రతి ఒక్క సభ్యుడు అనుసరించవలసిన విధానాల గురించి మదన్ లాల్ తెలిపారు. అనంతరం మదన్ లాల్ మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించండి, నేను మీలో ఒకడిగా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటు ప్రతి ఒక్క కార్యకర్తను కడుపులో పెట్టి చూసుకుంటానని, ఎప్పుడూ అండగా ఉంటానని, అందరం కలిసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం మని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు బీఆర్ఎస్ కు మళ్లీ పట్టం కట్టాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ లను వారు చెప్పే మాటలను ప్రజలు నమ్మరని, కాంగ్రెస్ పార్టీకి వారంటీ అయిపోయిందని తెలిపారు. 60 రోజులు ప్రతి ఒక్కరు కష్టపడి పని చేస్తే బీఆర్ఎస్ విజయం వైరా నియోజకవర్గంలో ఎవరు ఆపలేరని, ప్రతి కార్యకర్త గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి కేసీఆర్ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ కారూ గుర్తుకు ఓటు వేసి గెలిపించే విధంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీత రాములు, దిశ కమిటీ సభ్యులు కట్టా క్రిష్ణర్జునరావూ, జడ్పీటీసీ నంబురి కనకదుర్గ, మార్కెట్ చైర్మన్ పసూపూలేటి మోహనరావు, డాక్టర్ కాపా మురళి క్రిష్ణా, కౌన్సిలర్లు చల్లాగుండ్ల నాగేశ్వరరావు, డాక్టర్ దారేల్లి కోటయ్య, మాదినేని సునీత ప్రసాద్, తడికమళ్ళ నాగేశ్వరరావు, ఇమ్మడి రామారావు, సాదం రామారావు, భట్ట భద్రయ్య, అమ్మక రామారావు, సొసైటీ డైరెక్ట్ దొంతేబోయన వెంకటేశ్వర్లు,బీఆర్ యస్ మహిళ అధ్యక్షురాలు సక్కుబాయి, రామాలయం చైర్మన్ మిట్టపల్లి సత్యం బాబు తదితరులు పాల్గొన్నారు.