మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 13:
వైరా అసెంబ్లీ బీజేపీ టికెట్ ను స్ధానికులకే ఇవ్వాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కల్తి రాంప్రసాద్ కోరారు.దీనికి సంబంధించి శుక్రవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతికి వినతిపత్రం అందజేశారు.వైరా నియోజవర్గంలో అన్ని గ్రామాల్లో పరిచయం ఉన్న తనకు అవకాశం కల్పించాలని వినతిలో పేర్కొన్నారు.కారేపల్లి మండలం బస్వాపురం చెందిన తాను జడ్పీటీసీ ఎన్నికల్లో నిలబడి మూడో స్ధానంలో నిలిచానని,అదివాసీ నాయకునిగా,బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.వైరా నియోజవర్గం టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేశానని తనకు అవకాశం కల్పించాలని కల్తి రాంప్రసాద్ కోరారు.ఈకార్యక్రమంలో బీజేపీ కారేపల్లి,కొణిజర్ల మండల ప్రధాన కార్యదర్శులు కొండపల్లి ప్రదీఫ్,కొల్లి సుధాకర్ నాయకులు తురక నారాయణ,ఈసాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.బీజేపీ వైరా టికెట్ స్ధానికులకే ఇవ్వాలి.
మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 13:
వైరా అసెంబ్లీ బీజేపీ టికెట్ ను స్ధానికులకే ఇవ్వాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కల్తి రాంప్రసాద్ కోరారు.దీనికి సంబంధించి శుక్రవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతికి వినతిపత్రం అందజేశారు.వైరా నియోజవర్గంలో అన్ని గ్రామాల్లో పరిచయం ఉన్న తనకు అవకాశం కల్పించాలని వినతిలో పేర్కొన్నారు.కారేపల్లి మండలం బస్వాపురం చెందిన తాను జడ్పీటీసీ ఎన్నికల్లో నిలబడి మూడో స్ధానంలో నిలిచానని,అదివాసీ నాయకునిగా,బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.వైరా నియోజవర్గం టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేశానని తనకు అవకాశం కల్పించాలని కల్తి రాంప్రసాద్ కోరారు.ఈకార్యక్రమంలో బీజేపీ కారేపల్లి,కొణిజర్ల మండల ప్రధాన కార్యదర్శులు కొండపల్లి ప్రదీఫ్,కొల్లి సుధాకర్ నాయకులు తురక నారాయణ,ఈసాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
