UPDATES  

 మావోయిస్టు కొరియర్లు అరెస్టు

మావోయిస్టు కొరియర్లు అరెస్టు
*అసాంఘిక శక్తులకు సహకరిస్తే కఠిన చర్యలు
*వెంకటాపురం సీ ఐ కుమార్
మన్యం న్యూస్, వాజేడు:అసాంఘిక శక్తులకు సహకరిస్తే కఠిన చర్యలు ఉంటాయని వెంకటాపురం సీ ఐ కుమార్ హెచ్చరించారు.
మండలంలో ని జగన్నాధపురం గ్రామంలోవై జంక్షన్ పరిధిలో జాతీయ రహదారిపై వెంకటాపురం సీఐ కుమార్, ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ లు నిర్వహించారు. ఈ క్రమంలో ఏటూర్ నాగారం వైపు నుండి చత్తీస్గడ్ వైపుకు వెళుతున్న రెండు మోటార్ సైకిళ్ళు పై నలుగురు వ్యక్తులను అనుమానితులుగా గుర్తించారు. వారిని విచారణ చేయగా కడారి యాదగిరి, కాలకోట ప్రభాకర్, అనే వ్యక్తులు గతంలో మావోయిస్టు పార్టీలో పని చేశారని, పోలీసుల అరెస్టుతో జైలు జీవితం గడిపి,జనజీవన స్రవంతిలో కలిసి జీవించారనీ.మరల కొంతకాలంగా మావోయిస్టు పార్టీ అగ్ర నేతలలో ఒకరైన బడే చొక్కా రావు అలియాస్ దామోదర్కు కొరియర్ గా పనిచేస్తున్నట్లు విచారణలో తెలిపారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు యువతను ఆకర్షితులను చేసి మావోయిస్టు పార్టీలో చేరేందుకు ప్రేరేపణ చేసి ఇద్దరు వ్యక్తులు శివరాత్రి పవన్ కళ్యాణ్, యల్మాగంటి మహేష్, తీసుక వెళ్తుండగా మార్గం మధ్యలో పోలీసులకు పట్టుబడ్డరు. వారి బ్యాగులు తనిఖీ చేయగా బాంబుల తయారీలో పేలుడు పదార్థాలు, నిషేధిత మావోయిస్టు పార్టీ విప్లవ సాహిత్య పుస్తకాలు ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ కొరియర్లను సానుభూతిపరులను అరెస్టు చేసినట్లు సీఐ కుమార్ తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !