UPDATES  

 ఇంకెప్పుడు! * కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ

ఇంకెప్పుడు!
* కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ
* అయమయంలో కాంగ్రెస్ క్యాడర్
* కొత్తగూడెం సీటు కాంగ్రెస్ కా.. ఎర్ర పార్టీకా
* ప్రధాన సెంటర్లో ప్రకటనపై రాజకీయ చర్చ

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
అసెంబ్లీ ఎన్నికలపై రోజు రోజుకు చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఈసారి పోటీ ఉత్కంఠ భరితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఏ స్వీట్ కొట్టు దగ్గర కూర్చున్న.. ఏ టీ కొట్టు దగ్గర కూర్చున్న.. ఏ హోటల్ కి వెళ్ళిన.. పాలిటిక్స్ పైనే చర్చ కొనసాగుతూ ఉండడం గమనర్హం.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన విడుదల కావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రాజకీయ చదరంగంపై మాటల యుద్ధం మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే బి ఆర్ ఎస్ అధిష్టానం ముందుగానే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం నేటి వరకు అభ్యర్థుల ప్రకటన ప్రకటించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా కొంతమంది కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకొని అసహన రాగం బయటకు తీస్తుండడం వల్ల చర్చకు దారి తీస్తుంది. ఒక దిక్కు బి ఆర్ ఎస్ అభ్యర్థుల తరపున అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని తమ ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తుంది. టాప్ గేర్ లో కారు దూసుకుపోతున్నడంతో కొంత మంది కాంగ్రెస్ శ్రేణులు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షమైన కాంగ్రెస్ లో ఇంకా సీట్ల కేటాయింపు విషయంలో తర్జనభర్జన కొనసాగుతోంది. ఓ వైపు ఢిల్లీలో
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై తుదికసరత్తు జరుగుతుండగా మరో దిక్కు వామపక్షాలతో పొత్తు ప్రచారం ఇటీవల తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ క్యాడర్లో గందరగోళం నెలకొనడంతో పాటుగా సిపిఐకి రెండు సీట్లు సిపిఎంకు రెండు సీట్లు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చినట్లుగా ప్రచారం సాగడంతో ఇక్కడి కాంగ్రెస్ శ్రేణిలో మరింత ఉత్కంఠం రేకెత్తించింది. అంతేకాకుండా పైపెచ్చు కొత్తగూడెం సీటు సీపీఐకి ఇచ్చారని బాంబు పేలడంతో వెంటనే కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు రంగంలోకి దిగి అది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేయడం జరిగింది. ఇకపోతే పొత్తులలో భాగంగా భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను
పినపాకకు మార్చి భద్రాచలం సీటును సీపీఎంకు ఇస్తారని ప్రచారం జరగడంతో భద్రాచలం కొత్తగూడెం కాంగ్రెస్ వర్గీయులలో ఉత్కంఠ ఏర్పడిందని పలువురు మాట్లాడుకోవడం జరిగింది. ఇకపోతే కొందరు రాజకీయ వర్గాల వారు పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం బరిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిలవబోతున్నారని ప్రచారం జరగగా మరికొందరు పాలేరు నుంచి పొంగులేటి, ఖమ్మం నుంచి తుమ్మల పోటీ చేస్తున్నారని ప్రచారం జరిగిన తీరు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర నియోజకవర్గాల విషయంలోనూ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ప్రకటనపై ఉత్కంఠం కనిపిస్తుందని పలువురు మాట్లాడుకోవడం చర్చ నియాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ తాజాగా కొత్తగూడెం సీటు కాంగ్రెస్ కా.. ఎర్ర పార్టీకా.. అన్న దానిపైనే భద్రాద్రి జిల్లా కేంద్రం నడిబొడ్డులో చర్చ జోరుగా కొనసాగుతుండడంతో హాట్ టాపిక్ గా మారింది.
వెలువడని బిజెపి అభ్యర్థుల ప్రకటన…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులను అధిష్టానం ఎవర్ని నిలబెట్టబోతుందోననే దానిపై కొత్తగూడెం ప్రధాన సెంటర్లలో చర్చ జరుగుతుంది. బిజెపి అభ్యర్థుల జాబితా విడుదల విషయంలో ఆలస్యం కావడంతో ఆ పార్టీలోని కొందరు అసహన కూని రాగం తీయడం గమనించాల్సిన విషయం. ఇప్పటికే రెండుసార్లు బిజెపి పెద్దలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది. అయినప్పటికీ అభ్యర్థుల ప్రకటన వెలువడకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠం నెలకొంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !