మన్యం న్యూస్ గుండాల: మండలంలోని పోలింగ్ కేంద్రాలను నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ ఐటీడీఏ పీవో ప్రతిక్ జైన్ , మణుగూరు డిఎస్పి రాఘవేందర్రావు శుక్రవారంపరిశీలించారు. మండలంలోని చెట్టుపల్లి, శంభుని గూడెం, గుండాల, దామరతోగు, సాయనపల్లి గ్రామాల్లోని పోలింగ్ బూతులను పరిశీలించి పూర్తి వివరాలను సేకరించారు. పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లో ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాత్రి పది గంటల నుండి 6 గంటల వరకు ఎటువంటి మైకులు లౌడ్ స్పీకర్లను వినియోగించరాదని అన్నారు. రాజకీయ పార్టీలు ఎలక్షన్ సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఎల్ రంగ, ఎంపీడీవో సత్యనారాయణ, గుండాల సీఐ రవీందర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్, ఎంపీ ఓ వలి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
