మన్యం న్యూస్, కరకగూడెం: పినపాక నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రితిక్ జైన్ శుక్రవారం మండలంలోని ఎన్నికల బూత్ రూం లను పరిశీలించారు. అనంతరం కరకగూడెం చిరమళ్ల గ్రామాల మధ్య పెద్ద వాగుపై నిర్మించిన బ్రిడ్జి ఇటీవల కురిసిన బారి వర్షాల కారణంగా వాగు కోతకు గురికావడంతో అక్కడకి వెళ్ళి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫారం 6,7,8 దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలన్నారు.ఎఫ్ఎస్టి /ఎస్ఎస్ టి టీముల వారి యొక్క విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలు మీటింగ్ ల పర్మిషన్ పరిశీలించి మొదట వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వగలరని సూచించారు. ఆయన వెంట మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు, ఏడున్న బయ్యారం సిఐ శివప్రసాద్, కరకగూడెం ఎస్ఐ రాజారాం తహశిల్దార్ రవికుమార్ గిర్దవారులు హూస్సెన్,రాజు తదితరులు ఉన్నారు.
