UPDATES  

 మా బాబు బ్రెయిన్ సర్జరీ కి ఆర్థిక సాయం చేయండి…

మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 15:
మా బాబు ని కాపాడండి అంటూ ఆనారోగ్యంతో బాదపడుతున్నా తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సింగరేణి మండల పరిధిలోని గాదెపాడు గ్రామానికి చెందిన భూక్యా సంతు ప్రమీల లకు ఇద్దరు పిల్లలున్నారు.వారిలో పెద్ద కూమారుడు భూక్యా హర్షిత్( ప్రస్తుతం 7వ తరగతి) 2017 సంవత్సరం లో జ్వరం రావడంతో ఖమ్మంలో చికిత్స అందించిన ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ లోని రెయిన్ బో హస్పిటల్ ల్లో జాయిన్ చేయించారు.పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడు లో నీరు చేరిందని అత్యవసరంగా సర్జరీ చేయాలని సూచించడంతో సర్జరీ చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మరల వ్యాధి తిరగబడడంతో మళ్ళీ రెయిన్ బో హస్పిటల్ లో జాయిన్ చేయించారు.దింతో వైద్యులు మొదటిసారి చేసిన సర్జరీ సక్సెస్ కాలేదని మళ్ళీ రెండోసారి సర్జరీ చేయాలని వైద్యులు తెలపడంతో కూమారుడిని దక్కించుకోవాలని ఆశాతో రెండవసారి సైతం సర్జరీ చేయించారు.సర్జరీ అనంతరం నెలకు ఒకసారి చెకప్ కి వెళ్లాల్సి ఉన్న డబ్బులు లేక చెకప్ కి వెళ్లకపోవడంతో రెండవసారి చేసిన సర్జరీ కూడా విజయవంతం కాలేదని వైద్యులు మరోసారి అంటే మూడొవసారి సర్జరీ చేయాలని ఈనెల తొమ్మిదోవ తేదీన రెయిన్ బో హస్పిటల్ కి చెకప్ కోసం వెళ్లితే వైద్యులు చెప్పారని హర్షిత్ తల్లిదండ్రులు వాపోతున్నారు.ఒకవైపు హర్షిత్ తండ్రి సంతు కి 2021 సంవత్సరం లో రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయామై బ్రెయిన్ సర్జరీ చేశారు.సర్జరీ అనంతరం సంతు కి పక్షవాతం రావడంతో మంచానికి పరిమితమైయ్యాడు.ఇదిఇలాఉండగా హర్షిత్ తల్లి ప్రమీల కి కండరాలు ఎముకల బలహీనత వ్యాది రావడంతో హైదరాబాద్ నీమ్స్ హస్పిటల్ లో చూపించుకొని మందులు వాడుతొంది.కుటుంబ సభ్యులు స్నేహితులు సహకరంతో ఇంతవరకు వైద్యానికి పన్నెండు లక్షల రూపాయలు ఖర్చుపెట్టామని ఇక వైద్యం చేయించుకోవడం తమ వల్ల కాదని కనీసం తమ కూమారుడి ప్రాణాలైనా దాతలు కాపాడాలని హర్షిత్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.మేము ఇద్దరం ఉన్నతవిద్య చదివినా ఉపయోగం లేకుండా పోయిందని తమ పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఒకే ఇంట్లో ముగ్గురం వికలాంగులుగా మారామని రోదిస్తున్నారు హర్షిత్ తల్లిదండ్రులు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !