మన్యం న్యూస్,మణుగూరు:మండల పరిధి పీవీ కాలనీ నందు వైయస్సార్ నగర్ లో అఖిల్ అనే (7) సంవత్సరాల బాబు కి మెడకు కనితి గడ్డ లాగా ఏర్పడి తీవ్ర నొప్పితో బాధపడుతు వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారి ధీన గాథ ను చెలించిన పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ కన్వీనర్ నవీన్ బాబు తక్షణ సహాయం కింద వైద్య ఖర్చుల నిమిత్తం రూ 5వేలు అందించారు. నవీన్ బాబు మానవత్వాన్ని పలువురు కొనియాడారు.
