మన్యం న్యూస్ చర్ల:
తెలంగాణ రాష్ట్ర పండుగ అయినా దసరా పండుగలోని బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోనీ పలు గ్రామాల్లో గౌరమ్మ గద్దెలు వేసుకోనీ మహిళలు పెద్ద ఎత్తున ప్రారంభించారు. గణేష్ నగర్ లో భారీ సంఖ్యలో మహిళలు బతుకమ్మ సంబరాలలో పాల్గొని గౌరమ్మ పాటలు పాడుకుంటూ అంగరంగ వైభవంగా గౌరమ్మ ఉత్సవాల కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేసరి రమణ, రంగు సుశీల, పాసిగంటి సంధ్య, తనిగల శ్రావణి, ఇరసవడ్ల నవీన, మల్లేశ్వరి, నాగలక్ష్మి, గ్రామస్తులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.