మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు ఏరియా వర్క్ షాప్ విశ్రాంత ఉద్యోగి, సుందరయ్య నగర్ కు చెందిన ముక్కెర రామస్వామి ఇటీవల గుండె నొప్పితో తీవ్ర అనారోగ్యానికి గురి కావడం జరిగింది.డాక్టర్లు హైదరాబాదు రిఫరల్ చేయడం తో రామస్వామి కి సిపిఆర్ఎంఎస్ కార్డు లేకపోవడంతో సొంత డబ్బులు కట్టలేని స్థితిలో బిఆర్ఎస్ కత్తి రాము పరిస్థితి నీ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.సమస్యపై వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నిమ్స్ హాస్పటల్లో వైద్య సేవల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేపించడం జరిగిందన్నారు. వైద్యులు గుండెకు సంబంధించిన వాల్స్ మార్పిడి చేయడం జరిగింది రామస్వామి తెలిపారు.సరైన సమయం లో నాకు అన్ని విధాలుగా సహకరించి,నాకు పునర్జన్మ ప్రసాదించిన దేవుడు రేగా కాంతరావు అని రామస్వామి తెలిపారు.నా కుటుంబ సభ్యులు నేను ప్రభుత్వ విప్ రేగా కాంతరావు కు రుణపడి ఉంటానని ఈ సందర్బంగా విప్ రేగాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రతికి ఉన్నంతకాలం రేగా కాంతారావు తోనే ప్రయాణిస్తానని వారి గెలుపు కోసమే కృషి చేస్తానని రామస్వామి తెలియజేశారు.