మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండల పరిధి లోని తిల్లాపురం గ్రామం వద్ద డిఎస్పి డా.రాఘవేంద్రరావు ఆదేశాల మేరకు ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు.ద్విచక్ర వాహనాలను,కార్లను,వాహనాల పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఎన్నికల కోడ్ అమలు లో ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా వాహనాల తనిఖీ చేపట్టడం జరిగింది అని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని,సరైన పత్రాలు లేకపోతే వాహనాలను సీజ్ చేస్తామని వారు తెలిపారు. వాహనదారులు సరైన పత్రాలను కలిగి ఉండాలని అని సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలని పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.