UPDATES  

 విచ్చలవిడిగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు…. *పట్టించుకోని అధికారి యంత్రాంగం

మన్యం న్యూస్ చర్ల:
పంచాయతీ అభివృద్ధి పనుల పేరిట గ్రావెల్ తవ్వి అమ్ముకుంటున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లక్ష్మి కాలనీ పంచాయతీ పరిధిలోని దేవానగరం గ్రామం నుండి గత మూడు రోజులుగా గ్రావెల్ తోలకాలు యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు…ఆరా తీస్తే క్రీడా ప్రాంగణం చదును చేయిస్తున్నామని పంచాయతీ అధికారులు చెపుతున్నారు.ఓవైపు పంచాయతీ అభివృద్ధి పనులకోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పే అధికారులు ఇలా ప్రవేట్ రోడ్ల కోసం క్రీడా ప్రాంగణంలో తవ్వడమేంటే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అధికారులు ఇసుక ర్యాంప్ లకు గ్రావెల్ ను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక సొసైటీల మాటున రహదారి నిర్మాణాల పేరుతో మండల పరిధిలోని దేవానగరం, విజయ్ కాలనీ, లక్ష్మి కాలనీ ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు కొద్దిరోజుల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి.దేవానగరం సమీపంలో ప్రభుత్వ భూమిలో అడవికి వెళ్లే మార్గంలో భారీ యంత్రాలు తో గ్రావెల్ తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి.ప్రజలు తిరిగే దారిని మూసివేస్తూ భారీ టిప్పర్లు సైతం పెద్ద ఎత్తున తవ్వకాలు సాగిస్తున్నారు. అధికారుల అండదండలతోటే ఈ వ్యవహారం అంతా నడుస్తోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ భూమిలో తవ్వకాలు జరుగుతున్న వ్యవహారంలో బడా బాబులు అధికారులను మచ్చిక చేసుకొని అక్రమ గ్రావెల్ రవాణా జరుపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరుగుతున్న ప్రైవేటు వ్యక్తుల పెత్తనంపై ఎవరు నోరు మెదపడం లేదు. ఇసుక సొసైటీల మాటున అక్రమాలకు, అక్రమ తరలింపు ఉదంతంపై జిల్లా కలెక్టర్ స్పందించాలని, ఆక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై చర్య లు తీసుకోవాలని పీస సంఘ కార్యదర్శి తాటి వెంకట్రావు,ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !