రేగ మాస్టర్ ప్లాన్..!
* కారుకే జై అంటున్న జనం
* బిఆర్ఎస్ కు కంచుకోటగా పినపాక
* రేగా అభివృద్ధికి జయం మనదే స్వరం
* ప్రచారాల్లో దూసుకుపోతున్న కారు జోరు
* సర్వేల్లో గులాబీదే విజయం భారీ మెజార్టీ అంటూ చర్చ
* జరిగిన అభివృద్ధి చుట్టూ తిరుగుతున్న పొలిటికల్ వార్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
అతనిలో మంచితనం చిరునవ్వే అభిమానులను దగ్గరయ్యే విధంగా చేస్తుంది. ఎవరు ముందు పడిన ముందుగా రెండు చేతులతో దండం పెడుతూ చిరునవ్వు చిందించడం అతని నైజం.. మంచితనంతో నిండా అభిమానాన్ని పెంచుకున్న ఘనత మన్యం బిడ్డ రేగా కాంతారావుకే దక్కిందని చెప్పక తప్పదు. సేవ గుణం పుష్కలంగా ఉండడంతో రేగాకు ఫ్యాన్స్ రోజురోజుకు పెరుగుతుండడంతో ఇటు పినపాక నియోజకవర్గంలో అటు మండలాల్లో గ్రామ పంచాయతీలో సైతం చర్చ నియాంశంగా మారింది.
ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు అవకాశం కల్పించడంతో దానిని సద్వినియోగం చేసుకొని విజయవంతంగా ముందుకు పోతున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుకు జనం జై కొడుతున్నారు. మొదటి అవకాశంగా ఎమ్మెల్యే హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూ పినపాక నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతుండగా దీనిని గమనించిన సీఎం కేసీఆర్ రేగాకు మరో రెండు పదవులు అంటగట్టడం అంటే ఆశ మాషీ కాదు. ఈ పదవులను రేగ కాంతారావు అలంకరించడం వెంటనే ఆయన మాస్టర్ ప్లాన్ తో అభివృద్ధిలో మరింత స్పీడ్ పెంచుతూ ప్రజలకు అభిమానులకు దగ్గరయ్యారని స్వయంగా కొందరు బహిరంగంగా చెప్పడం గమనార్హం.
రేగ మాస్టర్ ప్లాన్ తో కోట్ల నిధులు…
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కున్న మంచితనం ఉపయోగపడడంతో పాటుగా సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా ఉంటూ రేగా మాస్టర్ ప్లాన్ ఉపయోగించి కోట్లాది రూపాయల నిధులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ఈ కోట్లాది నిధులతో పినపాక నియోజకవర్గాన్ని దీని పరిధిలో ఉన్న మండలాలు గ్రామ పంచాయతీలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఏజెన్సీలో సైతం విద్య వైద్య రంగం అభివృద్ధికి పెద్ద పీట వేశారు. దాదాపుగా వందకు వంద శాతం అభివృద్ధిలో చాణక్యుడిగా ముద్ర వేసుకున్న రేగాకే జై కొడుతూ మళ్లీ జయం మనదేరా అంటూ ప్రజలు అభిమానులు తమ స్వరం వినిపిస్తున్నారు.
బిఆర్ఎస్ కు కంచుకోటగా పినపాక…
పినపాకను అభివృద్ధిలో ముంచెత్తిన స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు రోజురోజుకు ఇటు అభిమానులు అటు ప్రజలు దగ్గరవుతుండడంతో బిఆర్ఎస్ కు కంచుకోటగా పినపాక నిలిచిందని కొందరు సీనియర్ రాజకీయ నాయకులు మాట్లాడడం గమనార్హం.
రేగా అభివృద్ధికి జయం మనదే స్వరం…
కళ్ళ ముందు అద్దం పట్టేలా కనిపిస్తున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన అభివృద్ధిని చూసి జయం మనదే స్వరం జనం వినిపిస్తున్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో మళ్లీ రేగా కాంతారావును గెలిపించుకొని అభివృద్ధిని కొనసాగించుకుంటామని పినపాక నియోజకవర్గం ఓటర్లు గట్టపదంగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. గత పాలకుల హాయంలో జరగని అభివృద్ధి రేగా హాయంలో అంతులేని అభివృద్ధి జరిగిందని ప్రజలు బహిరంగంగా పేర్కొంటున్నారు. ప్రజల ఉత్సాహం చూస్తే మళ్ళీ పినపాక ఇలా కాలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారాల్లో దూసుకుపోతున్న కారు జోరు…
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ఎమ్మెల్యే పినపాక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు ప్రచారంలో దూసుకుపోతున్నడంతో కారు జోరుకు ప్రతిపక్ష పార్టీలలో కొందరు నాయకులు కార్యకర్తలు బేజారవుతున్నారు. కారు స్పీడ్ ని చూసిన పలు పార్టీల నాయకుల్లో కలవరం మొదలైంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పినపాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు చేసిన అభివృద్ధికి ప్రజలు ఇతర పార్టీల నాయకుల కుటుంబాలు అకర్షితులై గులాబీ గూటికి రావడంతో రేగా గెలుపును ఎవరు ఆపలేరని ముమ్మరంగా పినపాక మణుగూరు ప్రాంతాలలో పాటుగా మారుమూల పల్లెల్లో సైతం పలువురు మాట్లాడుకోవడం పట్ల చర్చకు దారి తీస్తుంది.