అభివృద్ధి ప్రియంగా …వరించింది
ఆటంకాలేన్నేదురైనా అదరక బెదరక.. ఓర్పుతో నేర్పుతో ..
ప్రజల్లో జై జైల నీరాజనం..
హరి ప్రియ నాయక్ గెలుపు తథ్యం
* ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు
* హరిపీయకు బీఫామ్ రాకతో బాణాసంచా కాల్చి బీ. ఆర్.ఎస్ శ్రేణుల సంబురాలు
మన్యం న్యూస్, ఇల్లందు రూరల్:- ఇల్లందు నియోజక వర్గ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ కు ఎట్టకేలకు బీ ఫార్మ్ దక్కింది. ఎన్నో ఒడిదుడుకులు, ఊహాగానాల నడుమ, ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టపడే వారికే పట్టం కట్టాలనే గులాబీ దళపతి సీఎం కెసిఆర్ చేతుల మీదుగా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ బీ- ఫామ్ అందుకున్నారు. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ కు ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-పామ్ ను అందజేశారు. దాంతో ఇల్లందు లోని వారి క్యాంపు కార్యాలయం లో సంబరాలు అంబరాన్ని అంటాయి. జగదంబ సెంటర్ నందు గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, పాత బస్టాండ్ సెంటర్లలో జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ ఇన్చార్జ్ సుధీర్ తోతల, కోక్కు నాగేశ్వరావు, కటకం పద్మావతి, చీమల సుజాత, గిన్నారపు రజిత, రంగనాథ్, పరుచూరి వెంకటేశ్వర్ రావు, జనగం కోటేశ్వరరావు, లాల్ సింగ్ , ఖమ్మంపాటి రేణుక, పట్టణ కమిటీ, పట్టణ నాయకులు, గిన్నారపు రవి, సామల రవితేజ, గిన్నారపు రాజేష్, సనా రాజేష్, రాచపల్లి శీను, మసూద్ రబ్బు, ఘాజి, నెమలి ధనలక్ష్మి, కొక్కు సరిత, గండ్రతి చంద్రావతి, నారాయణమ్మ, ఎస్.కె చాంద్ పాషా, రాజూరి , వైశ్యాక్, గడ్డి శీను, తుంగపల్లి మహేష్, ఈదుల ముత్తయ్య,సుమన్, మండల నాయకులు మలుసురు, కవిత,రాజేశ్వరి. త్రివేణి, గుదిబండ శ్యామ్, సుమన్, లక్ష్మీనారాయణ, పాల్గొన్నారు.