..
ఖమ్మం :
కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టారంటూ కేసీఆర్‌పై పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కాపీ కొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు ఎలా ఇస్తారని అడిగారు. ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో ఎలా అమలు చేస్తారు. లక్ష కోట్ల మీ అక్రమ సంపాదనలో తీసి ఖర్చుపెడతారా. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చి దోచుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం. త్వరలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తాం.” అని పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
