ఐదుకు ఐదు స్థానాలు గెలుస్తున్నాం
* అన్ని సర్వేలు మనకే అనుకూలం
*బీ. ఆర్.ఎస్ అభ్యర్థుల విజయం కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలి
*విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి1ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు
మన్యం న్యూస్,పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలను కొత్తగూడెం,అశ్వారావుపేట, ఇల్లందు,భద్రాచలం, పినపాక నియోజకవర్గాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదివారం అన్నారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాయని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ,నాయకులు ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ తమ అభ్యర్థుల గెలుపునకు శ్రమించాలని పిలుపునిచ్చారు. 40 రోజులు కష్టపడితే భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీది అని అన్నారు.
