మన్యం న్యూస్,పినపాక: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ,ఎమ్మెల్యే రేగా కాంతారావు ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మండల నాయకులు, సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము పిలుపునిచ్చారు.ఆదివారం సీతంపేట లో గడప గడపకు బీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించి తమ అమూల్యమైన ఓట్లను కారు గుర్తుపై వేసి రేగా కాంతారావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పినపాక నియోజకవర్గంని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే రేగాకి దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రేగా సోషల్ మీడియా సభ్యులు పూస సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
