మన్యం న్యూస్,చండ్రుగొండ,అక్టోబర్ 15 : బిఆర్ఎస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటంతో బిఆర్ఎస్ మండల శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.. ఆదివారం జాతీయ రహదారిపై ప్రధాన సెంటర్లో బాణాసంచి పేల్చి, మిఠాయిలు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ…. ప్రతి పేద కుటుంబాన్ని ఆర్ధికంగా బలోపేతం చేయటం కోసం కేసీఆర్ మేనిఫెస్టోను తయారు చేయటం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించటం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు దార వెంకటేశ్వరరావు(దారా బాబు), ఉన్న, నాగరాజు, గుగులోత్ రమేష్, చాపలమడుగు రామరాజు, గాలం రవి, సుంకర రామారావు, గుగులోత్ ప్రవీణ్ ప్రకాశ్, సయ్యద్ యాకూబ్, మల్లెం వెంకటేశ్వర్లు,తలారి నాగరాజు, హనుమంతరావు, దాసరి సీతరాములు, ఉగ్గం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.