మన్యం న్యూస్,ఇల్లందు:అతిత్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇల్లందు బరిలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని పార్టీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గంలో బలంగా ఉందని గతంలో ఇల్లందులో ఎమ్మెల్యేగా గిలిచామని అలాగే రెండుసార్లు తమపార్టీ రెండోస్థానంలో నిలిచిందని అన్నారు. ఈ ఎన్నికల్లో తెదేపా బరిలో ఉంటుందని ఆ దిశగా మా కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆశావహుల పేర్లను రాష్ట్రపార్టీకి పంపించామని, టేకులపల్లి నుండి వాసం విజయ, ఇల్లందు మండలం నుండి విద్యార్థి సంఘం రాష్ట్రనేత చాందావత్ రమేష్ బాబు, గార్ల నుండి లక్ష్మయ్య, కామేపల్లీ నుండి బానోత్ రమేష్ లు ఉన్నారన్నారు. పార్టీ ఇప్పటికే విరిపేర్లను పరిశీలిస్తుందని ఎవరికి టికెట్ ఇచ్చిన గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాందావత్ రమేష్ బాబు, ఇల్లందు పట్టణ ప్రధానకార్యదర్శి ఉప్పనూతల రాజేందర్ గౌడ్, శ్యామ్ తీవారి, అయ్యారి నాగరాజు, కొబ్బరి శివ, మోహన్ లోద్, రాంగోపాల్ లోద్, దేశవత్ శ్రీహరి, టీఎన్ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు దాసరి గోపాలకృష్ణ, వినీత్, శ్రీవేద్ తదితరులు పాల్గొన్నారు.