ప్రజల పక్షాన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో.
మ్యానిఫెస్టో పట్ల హర్షం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు
పినపాక గడ్డపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం
మన్యం న్యూస్ కరకగూడెం: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అన్నీ వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.అదివారం కరకగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వం మూడోవ సారి అధికారంలోకి రావడం ఎన్నికల మ్యానిఫెస్టో నిదర్శనమని అన్నారు.కేసిఆర్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్,బిజెపి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సూచించారు.పినపాక గడ్డపై గులాబీ జెండా ఎగరవేసి,రేగా కాంతారావు మంత్రిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన తెలిపారు.బిఆర్ఎస్ కుటుంబసభ్యులు కేసిఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి మహిళలకు,రైతులకు,యువతకు వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సర్పంచ్ గొగ్గలి.నాగమణి గుడ్ల రంజిత్,చిట్టి సతీష్,కటకం లెనిన్,పోగు వెంకటేశ్వర్లు,సయ్యద్ ఫజల్ హుస్సేన్,యలగొండ శ్రీను,కల్లూరి బాలయ్య,గోగు వెంకన్న,యలగొండ వెంకట్,గిద్దె సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
