మన్యం న్యూస్,ఇల్లందు:తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమఅరెస్టుకు నిరసనగా ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి ఐదునిముషాల వరకు న్యాయానికి సంకేళ్లు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో భాగంగా చేతులకు సంకెళ్ళతో తెలుగుతమ్ముళ్లు నిరసన వ్యక్తంచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాందావత్ రమేష్ బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉప్పునూతల రాజేందర్ గౌడ్, దాసరి గోపాలకృష్ణ, శ్రీవేద్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
