- కేసీఆర్ బీమా ప్రతి ఇంటికీ ధీమా
- రైతుబీమా తరహాలో పేదలకు కేసీఆర్ బీమా పథకం
- రాష్ట్రంలో మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం
- సబ్బండ వర్గాల సంక్షేమానికి పెద్దపీట
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:
తెలంగాణ భవితకు భరోసా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావు అన్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మేనిఫెస్టో ప్రకటించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,రేగా కాంతరావు మాట్లాడుతూ, మేనిఫెస్టోతో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమన్నారు.సబ్బండ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మేనిఫెస్టో రూపకల్పన చేయటం జరిగింది అన్నారు. కేసీఆర్ బీమా,ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో ప్రతి ఇంటికి ధీమా ఇచ్చిన మేనిఫెస్టో అన్నారు.సౌభాగ్యలక్ష్మితో ప్రతి మహిళకు,తెలంగాణ అన్నపూర్ణతో పేదలకు సన్నబియ్యం అందించే గొప్ప మేనిఫెస్టో ఇదేనన్నారు. పింఛన్లు,రైతుబంధు పెంపుతో వారిలో కొండంత ధైర్యం నింపి, హైదరాబాద్‌లో మరో లక్ష మంది పేదల ఆత్మగౌరవాన్ని పెంచే మేనిఫెస్టో అని పేర్కొన్నారు.తొమ్మిదిన్నరేండ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేసి,ఇవ్వని హామీలను కూడా ఆచరణలోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు.సీఎం కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్‌తో ప్రతిపక్షాలు దిక్కు తోచని స్థితిలో పడిపోయాయన్నారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతూ,రికార్డ్ సృష్టించబోతున్నదన్నారు.ఇది బీఆర్‌ఎస్ మేనిఫెస్టో మాత్రమే కాదని,ప్రజల మేనిఫెస్టో అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు.