ప్రతి పక్షాల దిమ్మతిరిగే ల అధికార పార్టీ మేనిఫెస్టో -ఎంపీపీ జల్లిపల్లి
మన్యం న్యూస్,అశ్వారావుపేట:
బీఆర్ఎస్ పార్టి అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం మాన్యుఫెస్టో విడుదల చేసిన సందర్బంగా, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బి ఫామ్ తీసుకున్న సందర్బంగా అశ్వారావుపేట లోని రింగ్ రోడ్ సెంటర్ నందు బాణసంచా కాల్చి తెలంగాణ తల్లీ విగ్రహానికి పూలమాలలు వేసిఆ పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రంలో అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి జుజ్జూరపు రాంబాబు, అశ్వారావుపేట టౌన్ పార్టి ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి, కాసాని చంద్ర మోహన్, ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు సంకా ప్రసాద్, తాడేపల్లి రవి, సోమని రమేష్, చిప్పనపల్లి బజరయ్య, వెలుగు జాకబ్, గంధం వేంకటేశ్వర రావు, సుదర్శన్, తాళం సూరిబాబు, ఆవుల చిన్ని, కంచర్ల సత్యనారాయణ, రాంబాబు, యాసిన్, కలపాల దుర్గారావు, ధర్మరాజు, నక్కా రాంబాబు, నందికొల వెంకన్నబబు, కాంతారావు, వల్లేపు శ్రీను, బాణాల శ్రీను, గంధం ఆనంద్, తగరం హరిక్రిష్ణ, వేముల పండు, తోర్లపాటి నాగేశ్వర రావు మరియు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.