UPDATES  

 కొత్తగూడెం సీటు కాంగ్రెస్ అభ్యర్థికే ఇస్తా! * రేవంత్ రెడ్డిని కలిసిన పొంగులేటి

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
గెలిచే స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను కచ్చితంగా బరిలో నిలబడతామని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు సోమవారం
హైదరాబాదులో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్తగూడెం నియోజకవర్గ స్థానాన్ని కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని నిలబెడతామని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
గత కొన్ని రోజులుగా వివిధ మాధ్యమాలలో కొత్తగూడెం ఎమ్మెల్యే సీటుపై ప్రసారం అవుతున్న వార్తల్లో నిజం లేదని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం స్పష్టం చేసిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఊకంటి
గోపాలరావు, ఆళ్ళ మురళి, ఆకునురి కనకరాజు, నాగేంద్ర త్రివేది బొదసు కనక రాజు, మైనారిటీ జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ ఎండీ ఖలీల్, కుంచం వెంకటేష్, పొంగులేటి శీనన్న అభిమానులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !