- రేగా వర్సెస్ పాయం
- పాతకాపుల మధ్యే మళ్ళీ ఫైట్
- తలపడ్డ రెండుసార్లు.. రేగానే విన్నర్
- 21న కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటించే అవకాశం
(మన్యంన్యూస్ బ్యూరో)
పినపాక నియోజకవర్గంలో మళ్ళీ పాతకాపుల మధ్యే ఫైట్ జరగనుంది. బిఆర్ఎస్ అభ్యర్ధి రేగా కాంతారావు ఇప్పటికే ఖరారు కాగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా పాయం వెంకటేశ్వర్లు పేరు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 21న కాంగ్రెస్ జాబితా వచ్చే అవకాశం కనబడుతోంది. రేగా కాంతారావు వర్సెస్ పాయం వెంకటేశ్వర్లు మధ్య పోటీ జరిగిన రెండుసార్లు రేగా కాంతారావునే విజయం వరించింది. రేగా కాంతారావు బరిలో నిలిచిన రెండుసార్లు విజయం సాధించి.. అపజయం ఎరుగని నాయకుడిగా ఉన్నారు. 2014లో రేగా కాంతారావు అసెంబ్లీ బరిలో లేరు. 2009, 2018లో పోటీచేసిన రెండుసార్లు పాయంపై విజయం సాధించారు. రెండుసార్లు రేగా కాంతారావు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేయగా, తొలిసారి రేగా కాంతారావు బిఆర్ఎస్ అభ్యర్ధిగా కారుగుర్తుపై పోటీచేస్తున్నారు. రేగాకాంతారావు ఇప్పటికే ప్రచారం ప్రారంభించి జోరుగా దూసుకెళ్తున్నారు.
…………