మన్యం న్యూస్,అశ్వాపురం: బతుకమ్మ పండుగ వేడుకలు మండల వ్యాప్తంగా కోలాహలంగా కొనసాగుతున్నాయి. మూడవరోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా మహిళలు కొలుస్తారు. మండల కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి పాల్గొన్నారు.బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు
పిల్లలతో, పెద్దలతో బతుకమ్మ ఆడి పాటలు పాడారు. పినపాక నియోజకవర్గం ప్రజలందరూ పాడి,పంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలి చూడాలని ఆ గౌరమ్మని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.