ములకలపల్లి. మన్యం న్యూస్. అక్టోబర్.16.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ములకలపల్లి కి చెందిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పును సోమవారం వెలువరించారు.20 సెప్టెంబరు 2017న వరంగల్ వ్యాపారి చేల్పూరి వెంకటేశ్ హత్య కు సంబంధించి ములకలపల్లి ఏ ఎస్ఐ ఎం. సాయిబాబాకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి,అప్పటి ఇన్స్పెక్టర్ ఎం.ఏ. షుకుర్ కేసు దర్యాప్తు ప్రారంభించారు.దీనిలో భాగంగా ములకలపల్లి గొల్లగూడెం కి చెందిన జంగిలి సాయి, జంగిలి రమేష్ లు పాల్వంచకు చెందిన పాతూరి పార్థసారథి జామాయిల్ తోటలో పనిచేస్తూ వరంగల్ వ్యాపారి చెల్ఫూరి వెంకటేష్ వద్ద డబ్బులు దొంగతనం చేయాలని పథకం పన్నారు.దీని లో భాగంగా సెప్టెంబర్ నెల 2017న ఓ రాత్రి 11 గంటల ప్రాంతంలో అందరూ కలిసి పేకాటాడి చెల్పూరీ వెంకటేశు వద్ద డబ్బులు దొంగతనం చేయాలని పథకం పన్నారు. అందరు వెళ్ళిపోయాక, చేల్పూరి వెంకటేష్ తన ద్విచక్ర వాహనం వద్దకు వచ్చి డబ్బులు లెక్కపెట్టి జేబులో పెట్టుకోగానే వెనుకనుండి తల పై,ముఖంపై ఇనుప రాడ్డు కొట్టడంతో స్పాట్లో నే వెంకటేశు చనిపోయారు.నిందితులు వెంకటేష్ జేబులో ఉన్న రు.21,350 డబ్బులు తీసుకొని చనిపోయిన వెంకటేశుని పాములేరు వాగు వద్ద పడవేసి, దొంగిలించిన డబ్బులను పంచుకొని వెళ్లిపోయారని, దర్యాప్తులో తేలగా వారిపై అప్పటి ఇన్స్పెక్టర్ ఎమ్.ఎ.షుకూర్ కోర్టులో చార్జి షీటు దాఖలు చేశాడు.విచారణ లొ భాగంగా కోర్టులో 20 మంది సాక్షుల విచారించారు.కోర్టు విచారణ సందర్భంలో మొదటి ముద్దాయి జంగిలి సాయి చనిపోగా రెండవ ముద్దాయి జంగలి రమేష్ పై నేరo రుజువు కావడంతో భారత శిక్షాస్మృతి 302 ప్రకారము జీవిత ఖైదు రూ.1000 జరిమానా 379 (దొంగతనంకు) రెండు సంవత్సరాల కఠిన కారాగారి శిక్ష 500 రూపాయల జరిమానా( శవాన్ని కనపడకుండా చేయటం) 201 ప్రకారం మూడు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష 500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని రాధాకృష్ణమూర్తి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎన్.వీరబాబు, కోర్టు డ్యూటీ ఆఫీసర్,హెడ్ కానిస్టేబుల్ ఏ రామారావు,ప్రస్తుత ములకలపల్లి సబ్ ఇన్స్పెక్టర్ సాయి కిషోర్ రెడ్డి లు సహకరించారు.
