UPDATES  

 గులాబీ గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం?

గులాబీ గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం?
* బిఆర్ఎస్ వైపు చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు!
* టికెట్ల కేటాయింపుల ఆలస్యంపై అసహనం
* టెన్షన్ ఓపిక తట్టుకోలేక క్యాడర్ గరం గరం
* ఉత్కంఠం రేపుతున్న కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్
* భద్రాద్రి జిల్లా కేంద్రంలో మారుతున్న రాజకీయ చదరంగం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఆయా పార్టీల టికెట్ల కేటాయింపులో కొందరికి న్యాయం జరగకపోవడంతో వారంతా ప్రత్యామ్నాయ మార్గం వైపు చూస్తున్న పరిస్థితి నెలకొనడంతో చర్చనీయాంశంగా మారింది. ఇటు ఖమ్మం అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో
రాజకీయాలు విచిత్రంగా ఉండడంతో వాటిపై రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకోవడం గమనార్హం.
ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్నికల వాతావరణం ఇప్పుడిప్పుడే వేడెక్కుతుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఇక్కట్ల కేటాయింపు విషయంలో రోజురోజుకు ఆలస్యం జరగడంతో కొంతమంది కాంగ్రెస్ శ్రేణులలో అసహన రాగం వినిపిస్తుంది. ఈ జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగూడెం భద్రాచలం ఇల్లందు పినపాక అశ్వరావుపేటలు అసెంబ్లీ సెగ్మెంట్లుగా ఉండగా కేవలం భద్రాచలం సెగ్మెంట్కు కాంగ్రెస్ టికెట్ సిటింగ్ ఎమ్మెల్యేకు పొదెం వీరయ్యకు ఇచ్చిన విషయం తెలిసిందే. మిగతా నాలుగు సిగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పలువురు కాంగ్రెస్ నేతలు ఓపిక టెన్షన్ పడుతూ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. ఒక దిక్కు భారత రాష్ట్ర సమితి అధిష్టానం, సీఎం కేసీఆర్ దాదాపు అందరికి సీట్లు ఖరారు చేసి తమ గులాబీ అభ్యర్థులకు బిఫామ్ లు సైతం ఇవ్వడంతో ఇక్కడి కొందరి కాంగ్రెస్ నేతల్లో ఉన్న టెన్షన్ కన్నా ఆ టెన్షన్ మరింత రెట్టింపు అయింది. కాంగ్రెస్ పూర్తిస్థాయిలో టికెట్లను డిక్లేర్ చేయకపోవడంతో పలువురు కాంగ్రెస్ నేతల్లో ఓపిక నశించిపోయి ప్రత్యామ్నాయవైపుగా చూస్తున్నట్లు కొందరు వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు బహిరంగంగా చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది.
హాట్ టాపిక్ గా కొత్తగూడెం సెగ్మెంట్..
కాంగ్రెస్ వామపక్షాల పొత్తులో భాగంగా కొత్తగూడెం సెగ్మెంట్ సిపిఐ పార్టీకి పోతుందనే వార్త గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాలలో చెక్కర్లు కొడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కొత్తగూడెం సీటు కాంగ్రెస్ కాకుండా సిపిఐ కేటాయిస్తే సహించబోమని కాంగ్రెస్ లో ఒక వర్గం బహిరంగంగా పేర్కొంటుంది. ఈ విషయం కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకుల దృష్టికి పోవడంతో కొత్తగూడెం సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై నేటి వరకు తర్జనభర్జన కొనసాగుతూనే
ఉంది. కొత్తగూడెం అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించని పక్షంలో “హస్తం”ను వీడేందుకు ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటుగా మరికొందరు నాయకులు సిద్ధంగా ఉండడంతోపాటు ఇతర పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం ముమ్మరంగా కొనసాగడం పట్ల ప్రస్తుతం భద్రాద్రి జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది.
బిఆర్ఎస్ వైపు చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు..!
కొత్తగూడెం సెగ్మెంట్ కు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంతోపాటు పార్టీని నమ్ముకుని మొదట్నుంచి కాంగ్రెస్ కు సేవ చేస్తున్న ఒక సీనియర్ కాంగ్రెస్ నాయుడుకే టిక్కెట్ ఇస్తే సరే సరే లేదంటే ఆ పార్టీ నాయకుడు బిఆర్ఎస్ పార్టీలోకి పోవడం ఖాయమని అంతేకాకుండా ఆయన వెంటే తాము సైతం పోతామని కాంగ్రెస్ లోని ఒక వర్గం కాంగ్రెస్ క్యాడర్ హెచ్చరించడం పట్ల చర్చకు దారి తీసింది. ఏది ఏమైనప్పటికీ కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ ను కాంగ్రెస్ కే కేటాయించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భీష్మించి కూర్చోవడం పట్ల ఈ డిమాండ్ భద్రాద్రి జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్ గా మారడంతో పాటు ఠారెత్తిస్తుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !