మన్యం న్యూస్ ,భద్రాచలం:
ఈ నెల 15న డోర్నకల్ లో జరిగిన ఆరు జిల్లాల స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు మూడు బంగారు పథకాలు, రెండు సిల్వర్ పథకాలు, ఒక కాంస్య పథకం సాధించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 69 కేజీల ఉమెన్స్ విభాగంలో , మామిడి భూమికకు బంగారు పథకం, 59 కేజీల విభాగంలో, ఎస్ భరత్ కుమార్ కు బంగారు పధకం, 105 కేజీల విభాగంలో మోతుకూరి పవన్ కు బంగారు పతకం, 73 కేజీల విభాగంలో, వి కాశి కుమార్ కు సిల్వర్ పథకం, 105 కేజీల విభాగంలో, అంజి రెడ్డికి కాంస్య పథకం, 105 కేజీల మాస్టర్స్ విభాగంలో, శోభన్ నాయక్ గుగులోత్ కు సిల్వర్ పథకము, సాధించినట్లు తెలిపారు. ఈ గెలుపొందిన క్రీడాకారులు సిటీ స్టైల్ జిమ్ లో ఈ విజయానికి కారణమైనటువంటి జిమ్ కోచ్ జివి రామి రెడ్డి నీ సాలువతో ఘనంగా సన్మానించడం జరిగింది.జిమ్ కోచ్ జివి రామిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 21న హైదరాబాదులోని షేక్ పేటలో జరగబోయే రాష్ట్ర స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలకు ఇప్పుడు గెలుపొందిన విద్యార్థులంతా హాజరవ్వాలని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు.