మన్యం న్యూస్,ఇల్లందు నవంబర్ 30న తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ కు ఆదివారం హైదరాబాదులోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బీఫామ్ ను అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పట్టణంలోని స్థానిక 18వ వార్డులో గల రాందేవ్ బాబా ఆలయంలో సోమవారం ఎమ్మెల్యే హరిప్రియ దంపతులు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ ఇంచార్జ్ సుధీర్ తోత్ల, పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఫ్లోర్ లీడర్ నాగేశ్వరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, ప్రముఖ వ్యాపారవేత్త ఓం ప్రకాష్, సోషల్ మీడియా, యువజన నాయకులు మహేందర్, గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.