మన్యం న్యూస్
నూగురు వెంకటాపురం.
తెలంగాణ సరిహద్దు చతిస్గడ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఒకసారిగా ఏజెన్సీ ప్రాంతంలో అలజడులు రేగాయి , చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీస్ స్టేషన్ సహాయక ప్రాంతమైన కొరంజెడ్ బందేపార అడవుల్లో ఎయిడెడ్ ఏరియా కమిటీ ఇన్చార్జ్ డివిసిఎం నగేష్ సెక్రటరీ ఏ సీఎం బుచ్చన్న ఏసీఎం విశ్వనాథ్ మరో 15 20 మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీస్ ఎస్ టి ఎస్ ప్రత్యేక బలగాలు ప్రత్యేక బలగాలు కలిసి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఉదయం బందే పారా అటే ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భయంకరమైన ఎన్కౌంటర్ జరిగింది . ఈ ఎన్కౌంటర్లో ఏకే 47 ఆయుధాలను ఇతర పేలుడు సామాగ్రిని పోలీస్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కోరంజెడ్ బందే పారా అటవీ ప్రాంతంలో మావోయిస్టు క్యాంపులు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసు బలగాలు గుర్తించి ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు, తెలంగాణ సరిహద్దుల్లో ఎన్కౌంటర్లు జరగడంతో మండల పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యారు సరిహద్దు ఏరియా అంతా రెడ్డి లడ్డు పోలీస్ ని గాని పెంచారు. ఇంకా సరిహద్దుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.