మన్యం న్యూస్ కరకగూడెం:ఆర్ఎంపీలు పరిమితికి మించి వైద్యం చేయొద్దు అని జిల్లా సహాయ మలేరియా వైద్యాధికారి గొంది వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన మంగళవారం కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో రికార్డులను పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్యంపై ప్రభుత్వ వైద్యాధికారి దుర్గాభవాని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్ఎంపి క్లినిక్ లను పరిశీలించి ఆర్ఎంపీలు అర్హతకు మించి వైద్యం చేయద్దని తెలిపారు. ఆర్ఎంపి వైద్యశాలలో ఉన్న డెంగ్యూ, మలేరియా,రోగులను తక్షణమే ప్రభుత్వ వైద్యశాలకు పంపించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలకు వైద్యశాలలో మెరుగైన ఆర్ఎంపీల వద్దకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఆయన కోరారు. మితిమీరి వైద్యం చేస్తూ ఆర్ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.మలేరియా, డెంగ్యూ లక్షణాలు ఉంటే ప్రభుత్వ వైద్యశాలకు పంపాలని ఆర్ఎంపి వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి దుర్గాభవాని వైద్య సిబ్బంది కృష్ణ, నరసింహారావు,పద్మ ,శ్రీను ఆశ వర్కర్లు పాల్గొన్నారు.