మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 17:
సింగరేణి మండల కేంద్రంలో బోడేపూడి ట్రస్ట్ వ్యవస్థాపకులు బోడెపూడి రాజా మంగళవారం పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా వృద్ధులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసి వారికి మనోధైర్యం నింపారు.అనంతరం ఇటీవలే బైక్ యాక్సిడెంట్ లో గాయపడిన రిపోర్టర్ బోడ అశోక్ ని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ,నా ప్రయాణం నిరుపేదలతోటి కొనసాగిస్తానని,సహాయం చేయడంలోనే కిక్ ఉంటుందని,నిరుపేదలకు చేయూత అందించడమే నా ఉద్దేశం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు షేక్.షరీఫ్ పాషా,అనిల్,తదితరులు పాల్గొన్నారు.