మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 17:
రెండు మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం కారేపల్లి క్రాస్ రోజ్ సమీపంలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్,గుంటూరు జిల్లా,భీమవరానికి చెందిన తత్తిళ్ళపట్టి శ్రావణ్ మోటర్ సైకిల్‌పై ఇల్లందు వెళ్తున్నాడు.ఇదే క్రమంలో కారేపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న నర్సరీ నుండి మధురానగర్ కు చెందిన గుగులోత్ సురేందర్ మోటర్ సైకిల్ తో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి రోడ్డు మీద వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో శ్రావణ్‌కు బలమైన గాయం కావడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు.ఎస్సై పుష్పాల రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని అంబులెన్సులో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.