మన్యం న్యూస్ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రేగా.కాంతారావు గెలుపు కోసం అహర్నిశలు కష్టపడతామని సమత్ మోతే సర్పంచ్ ఇర్ప విజయ్ కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గొల్లగూడెం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు గెలుపు కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నూతన మ్యానిఫేస్టో వివరిస్తూ ఇంటింటికి ప్రచారం చెయ్యడం జరిగిందని అన్నారు.అలాగే కారు గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు వివరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మల్కం. వెంకటేశ్వర్లు,ఉపసర్పంచ్. చేను.సాంబయ్య,సుతారి. నాగేశ్వరరావు, ఇర్ప.నగేష్,మల్కం.క్రిష్ణ ప్రసాద్, గుడ్ల.రంజీత్ కుమార్,మల్కం.పుల్లయ్య,ఇర్ప.వంశీ,పాలకుర్తి. వినోద్ పాల్గొన్నారు.