మన్యం న్యూస్,ఇల్లందు:తెదేపా ముఖ్యనాయకుల సమావేశం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ మేరకు ఏర్పాటుచేసిన సమావేశంలో తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన రెండు మేనిఫెస్టోలు కనీసం అమలుచేయని కెసిఆర్ నేడు మరో కొత్త మాయాజాలనికి తెరతీశారని ఎద్దేవా చేశారు. గత మేనిఫెస్టోలో పెట్టిన ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడుఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ ఉచితవిద్య, ప్రతి జిల్లాకు సూపర్ స్పెషల్టి హాస్పిటల్, ప్రతి నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజీ, గిరిజనులకు 12% రిజర్వేషన్, జర్నలిస్టులకు ప్లాట్లు, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయని పది సంవత్సరాలనుండి అధికారంలో ఉండి ఇవన్నిచేయని ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ రాష్ట్రప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో సాధ్యం కాదన్న కేసీఆర్ ఇప్ప్పుడు ఏ బడ్జెట్ తో హామీలు ఇస్తారని అన్నారు. అసలు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఇవన్నీ ఎందుకు చేయలేదని ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నామని ఇంకో అవకాశం కెసిఆర్ కు ఇవ్వాలిసిన అవసరం లేదని అన్నారు. మాయమాటలతో మళ్ళీ కేసీఆర్ ప్రజల ముందుకు వస్తున్నారని ప్రజలు ఎవరు కేసీఆర్ మాటలు విని మోసపోవద్దని ఈ సందర్భంగా ముద్రగడ వంశీ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదలవుతుందని బడుగు బలహీన వర్గాలతో పాటు పేదలకు కావలసిన అన్నిఅంశాలు పొందుపరిచి అందరికీ సమన్యాయం కలిగేలా మా మేనిఫెస్టో ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష, కార్యదర్శిలు పాలమూరు బాలకృష్ణ, ఉప్పునూతల రాజేందర్ గౌడ్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాందావత్ రమేష్ బాబు, మాటేలా రత్నాకార్, దాసరి గోపాలకృష్ణ, దేవరకొండ నవీన్, చింటూ, సీనియర్ నాయకులు శ్యామ్ తీవారి, బాబు, ముత్యాల రమేష్, గోరెంట్ల రామయ్య, సింధు రమేష్, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.