UPDATES  

 ‘భగవంత్ కేసరి’ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ ఖరారు చేసారు.

ఈ సినిమా అక్టోబర్ 19, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ యాక్షన్ డ్రామా వరల్డ్ వైడ్ గా 67.35 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

ఈ బిగ్గీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !