UPDATES  

 ఈ సుందరి వెండితెర యువరాణి.. చిరునవ్వు చిందిస్తోన్న నయనాలు.. ఎవరో గుర్తుపట్టగలరా ?..

‘సుందరి నేనే నువ్వంట.. చూడని నీలో నన్నంట.. కానుకే ఇచ్చా మనసంతా.. జన్మకే తోడై నేనుంటా’ అంటూ సాంగ్ గుర్తొస్తుంది కదా ఆ ముద్దుగుమ్మ ఫోజు చూస్తుంటే..

ఈ అమ్మడుకు పాన్ ఇండియా లెవల్లో ఎక్కువగానే ఫాలోయింగ్ ఉందండి. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. రీల్ లైఫ్ లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఆమె యువరాణి. వేల కోట్లకు వారసురాలి. ఆమె తండ్రి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరో. ఇక తల్లి ఒకప్పుడు వరుస లతో అలరించిన సీనియర్ హీరోయిన్. ఇప్పుడు కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో వరుస హిట్ చిత్రాలతో ఫుల్ బిజీగా కెరీర్ కొనసాగిస్తోన్న ఈ బ్యూటీ..ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. అంతేకాదు.. త్వరలోనే తెలుగులో ఓ చేయబోతుందని రూమర్స్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎవరో గుర్తుపట్టారా ?.. ప్రస్తుతం ఆమె తండ్రి తెలుగు ల్లో విలన్ పాత్రలు పోషిస్తున్నారు. మీరు గెస్ చేసింది కరెక్టే. తను బీటౌన్ అందాల రాశి సారా అలీ ఖాన్. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, అమృతాసింగ్ దంపతుల గారాలపట్టి సారా అలీ ఖాన్.

కేదార్ నాథ్ తో కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది సారా. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించారు. ఆ తర్వాత రణ్వీర్ కపూర్ జోడిగా సింబ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. స్టార్ హీరో వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన నటనతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న లను ఎంచుకుంటూ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ అగ్ర కథానాయికగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతుంది. ఇటీవలే జరా హట్కే జరా బచ్కే తో సూపర్ హిట్ అందుకుంది. ఇందులో విక్కీ కౌశల్ హీరోగా నటించారు.

ఓవైపు వరుస లతో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంటుంది సారా. నిత్యం లేటేస్ట్ కొత్త ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సారాకు సంబంధించిన క్రేజీ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్వరలోనే సారా తెలుగులోకి అడుగుపెట్టబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె తెలుగు ప్రాజెక్టుకు ఓకే చెప్పేసిందని టాక్. కానీ ఆ లో నటించే నటీనటులకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియరాలేదు. త్వరలోనే సారా తెలుగు మూవీ గురించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !