UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 ‘సురేష్ కొండేటి’తో సినిమా చేస్తా.. జర్నలిస్టును అయిపోతానంటున్న తరుణ్ భాస్కర్

తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో సినిమా ‘కీడా కోలా’తో వస్తున్నారు.

క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్‌తో ఈ సినిమా హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేయగా ఈరోజు ఈ సినిమాను సమర్పిస్తున్న రానా దగ్గుబాటి థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ తరుణ్ భాస్కర్ దాస్యం కొన్ని పంచ్ లు వేశారు. ముందుగా మీడియా ప్రతినిధులు మీరు సినిమాలు డైరెక్ట్ చేయకుండా ఎందుకు నటన మీద ఫోకస్ పెడుతున్నారు? అనే విషయాన్ని గట్టిగా ఫోకస్ చేయగా అది తన తీట అని ఆయన చెప్పుకొచ్చారు.

 

అంతేకాక ఎందుకు సురేష్ బాబు గారి కాంపౌండ్ లోనే ఉండిపోయారు, ఆయనతోనే ఎందుకు సినిమాలు చేస్తున్నారు అని అడిగితే తనకు సురేష్ అనే పేరు కలిసి వచ్చిందని అన్నారు. న్యూమరాలజీ, నమ్మే తాను సురేష్ అనే పేరు ఉన్న వారితో ఎవరితో అయినా సినిమాలు చేస్తానని అన్నారు. సురేష్ కొండేటితో కూడా సినిమాలు చేస్తానని అన్నారు. అలాగే నటన మీదనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అని అడిగితే దానికి ఆయన స్పందిస్తూ జర్నలిస్టు అయిన సురేష్ కొండేటి డాన్స్ చేయవచ్చు కానీ డైరెక్టర్ అయిన నేను సినిమాల్లో నటించకూడదా ? అని ప్రశ్నించారు. అంతేకాక తాను జర్నలిస్టుగా అవ్వాలని అనుకుంటున్నానని కోర్సు చేసి వస్తానని కూడా ఆయన కామెంట్ చేయడం గమనార్హం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !